అలాంటి సినిమాలే నేను చేస్తా: అనన్య నాగళ్ల
అనన్య నాగళ్ల హీరోయిన్‌గా వస్తోన్న మూవీ లీసా. జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. తాను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా.. అందులో చేయడానికి కొత్తగా ఏముంటుందని చూసుకుంటానని అనన్య తెలిపింది. లీసా కథ విన్నప్పుడు ఇలాంటి రోల్ తాను ఎప్పుడూ చేయలేదనిపించిందని.. మూవీలో అవకాశం దక్కడం సంతోషంగా ఉందని పేర్కొంది.