వివేకా హత్యపై అనగాని కీలక ఆరోపణలు
AP: మాజీమంత్రి వివేకా హత్యపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ఆరోపణలు చేశారు. ఐదేళ్లు సీఎంగా ఉండి జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డికి రక్తపు మరకలు తుడవాల్సిన పనేంటి అని అడిగారు. సునీతపై అనుమానాలు వ్యక్తం చేయడం దారుణమని, న్యాయస్థానాలపై తమకు నమ్మకముందని పేర్కొన్నారు.