పోటీగడ్డ తండాలో సిమెంట్ బెంచీల ఏర్పాటు

పోటీగడ్డ తండాలో సిమెంట్ బెంచీల ఏర్పాటు

VKB: కుల్కచర్ల మండలంలోని పోటీగడ్డ తండాలో సేవలాల్ యూత్ సభ్యులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. గ్రామంలోని ప్రధాన కూడలి, ప్రభుత్వ పాఠశాల ఆవరణ, బస్టాండ్ గేటు వద్ద వృద్ధులు, ప్రయాణికుల సౌకర్యార్థం నిన్న సొంత ఖర్చులతో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఎండనక, వాననక వేచి చూసే వారికి ఈ బెంచీలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.