‘పోలీస్, GHMC అధికారుల కృషి వెలకట్టలేనిది’

‘పోలీస్, GHMC అధికారుల కృషి వెలకట్టలేనిది’

TG: గోషామహల్ శ్రీరామనవమి శోభాయాత్ర ఘనవిజయానికి సహకరించిన పోలీస్, GHMC, విద్యుత్ సహా ఇతర విభాగాల అధికారులకు MLA రాజాసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర విజయవంతం కావడంలో కార్యకర్తలు, అన్నప్రసాద నిర్వాహకులు, రామ భక్తుల కృషి, క్రమశిక్షణ వెలకట్టలేనివని ఆయన కొనియాడారు. రామభక్తుల అచంచల భక్తితో ఈ యాత్ర ఒక దివ్యమైన, చారిత్రాత్మక వేడుకగా నిలిచిపోయిందని రాజాసింగ్ పేర్కొన్నారు.