కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది: MLA

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది: MLA

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆందోళనలు, అభ్యంతరాలను నివేదికగా రూపొందించి ఒంగోలు వైఎస్ఆర్సిపి కార్యాలయానికి పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.