వేసవి శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం
ATP: 2026 సంవత్సరానికి గాను వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆసక్తి, అర్హత గల కోచ్ లు ఈ నెల 6వతేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మంజుల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 16 ఏళ్లలోపు బాల, బాలికలకు శిక్షణ శిబిరాలు మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.