రోడ్డు మీద గొయ్యిల్లో చేపల వేట చేస్తూ వినూత్న నిరసన

అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో కొత్తకోట కొత్త పెట్రోల్ బంకు వద్ద భారీ గొయ్యిలు ఏర్పడ్డాయి. ఈ గొయ్యిల్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినూత్నంగా చేపల వేట చేసి నిరసన తెలియజేశారు. నల్లరాయి క్వారీల నుంచి గ్రానైట్ను తరలిస్తూ భారీ వాహనాలతో 60 టన్నుల బరువును బియన్ రోడ్డుపై వెళ్లడానికి పర్మిషన్ లేకపోయినా అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.