కంభంలో రక్తదాన శిబిరం

కంభంలో రక్తదాన శిబిరం

ప్రకాశం: ప్రతి మూడు నెలలకు రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని ఎంపీడీవో వీరభద్రచారి అన్నారు. కంభంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏపీ వైద్య విధాన పరిషత్ బ్లడ్ బ్యాంకు అధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానమని, ఆపద సమయంలో ప్రాణాలను నిలబెడుతుందని సూచించారు. సచివాలయ సిబ్బంది 28 మంది రక్తదానం చేశారన్నారు.