OTT క్రైం సీన్లు చూసి హత్య చేసిన బాలుడు

TG: సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సహస్రను హత్య చేసిన తర్వాత కత్తిని ఆమె ఇంట్లోనే బాలుడు శుభ్రపరిచాడని పోలీసులు తెలిపారు. అయితే హత్య చేసిన తర్వాత తన కుందేలును తీసుకుని డాక్టర్ దగ్గరికి బాలుడు వెళ్లాడు. పోలీసులు విచారించినప్పుడు కూడా హత్య జరిగిన సమయంలో తాను ఆస్పత్రిలో ఉన్నట్లు చెప్పాడట. OTTలో క్రైం సీన్లు చూసి బాలుడు హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.