తిరుమల ఘాట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం
TPT: తిరుమల రెండో ఘాట్ సమీపంలో గురువారం ఒక సుమో వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జీఎన్సీ టోల్ గేటు, దివ్వరామం ప్రాంతంలో జరిగింది. వాహన బ్యాటరీ అధిక వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించింది.