నూతనకల్ మండలంలో 3 టీబీ రహిత గ్రామాలు
SRPT: టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని చిల్పకుంట్ల, కొత్తతండా, అలుగునూరు గ్రామాలను క్షయ రహిత పంచాయతీలుగా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ చేతుల మీదుగా ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో అవార్డులు అందుకున్నారు.