'శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి'
SKLM: సారవకోట మండలం పెద్దలంబ సచివాలయాన్ని మంగళవారం ఎంపీడీవో మురళీమోహన్ కుమార్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. గ్రామంలో ఇంటి పన్నులు, వ్యాపార సంస్థలకు సంబంధించిన పన్నులు శత శాతం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. వీధుల్లో పశువులు కట్టకుండా చేయాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు.