INSPIRATION: కిత్తూరు చెన్నమ్మ

INSPIRATION: కిత్తూరు చెన్నమ్మ

కిత్తూరు చెన్నమ్మ(1778–1829) స్వాతంత్య్ర సంగ్రామంలో తొలి వీరనారిగా చరిత్రలో నిలిచింది. ఈమె కర్ణాటకలోని చిన్న రాజ్యమైన కిత్తూరుకు రాణి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దత్తత నిషేధ చట్టాన్ని ధైర్యంగా వ్యతిరేకించిన తొలి పాలకురాలు ఈమె. 1824లో ఆమె భర్త, కుమారుడు మరణించాక బ్రిటిష్ వారు కిత్తూరును ఆక్రమించాలని చూసినప్పుడు చెన్నమ్మ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది.