నేడు సైన్స్ కేంద్రంలో విద్యార్థులకు పోటీలు

NLR: అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంగళవారం (నేడు) నెల్లూరులోని జిల్లా సైన్ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు చిత్రలేఖనం, వ్యాసరచన, వకృత్వం, నాటక ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు సైన్స్ మ్యూజియం ఇంఛార్జ్ శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.