బూరగాంలో బడి పిలుస్తోంది కార్యక్రమం
SKLM: టెక్కలి మండలం బూరగాం ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో "బడి పిలుస్తోంది" కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పూజారి హరిప్రసన్న సర్కారు బడిని కాపాడుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇయ్యాలని పిలువునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధి హామీ కూలీలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.