హజరత్ జమాలుల్లా బాబా ఉరుసు మహోత్సవాలు

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని హజరత్ జమాలుల్లా బాబా ఉరుసు మహోత్సవాలు ఈ నెల 4 నుంచి జరగనున్నాయి. 4 గురువారం గంధం ఊరేగింపుతో ఉరుసు మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 శుక్రవారం మధ్యాహ్నం దర్గా ఆవరణలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, ఈ ఉరుసు మహోత్సవంలో హిందూ ముస్లిం సోదరులు పాల్గొని జయప్రదం చేయాలని దర్గా నిర్వాహకులు కోరారు.