టైలరింగ్ శిక్షణా తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: మహిళలకు ఆసరాగా ఉండేందుకు ఎన్డీయే ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశ పెడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రావులపాలెం గ్రామం రైతు సేవా కేంద్ర భవనంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత టైలరింగ్ శిక్షణా తరగతులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.