VIDEO: తడ్కల్‌లో రేణుక ఎల్లమ్మ బోనాలు

VIDEO: తడ్కల్‌లో రేణుక ఎల్లమ్మ బోనాలు

SRD: కంగ్టి మండలం తడ్కల్‌లో రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, ప్రత్యేక హారతి వంటి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు వాయిద్యాలు, నృత్యాల మధ్య శోభయాత్ర అట్టహాసంగా సాగింది. భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించారు.