తల్లిదండ్రుల చెంతకు అదృశ్యమైన బాలికలు

KKD: జగ్గంపేట మండలం జె.కొత్తూరులో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలు ఆదివారం స్కూల్‌కి రాకపోవడంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జగ్గంపేట ఎస్సై రఘునాథరావు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ బాలికల ఆచూకీ తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.