శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

కర్నూలు: శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక అధికారి నియమితులైన దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్, ఈఓ శ్రీనివాసరావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు, మంచి నీటి సరఫరా, గంగలో, స్నానాలకు ఏర్పాట్లు, భక్తులు తలనీలాలు సమర్పించేందుకు చేయాల్సిన ఏర్పాట్లు, ట్రాఫిక్ వైద్య ఆరోగ్య సేవలు, పార్కింగ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లపై చర్చించారు.