ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు చర్యలు

కృష్ణా: నూజివీడు పట్టణ సర్కిల్ కార్యాలయాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. DSP లక్ష్మయ్య, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి నూజివీడు నియోజకవర్గంలో ఎన్నికల నేపథ్యంలో చేపట్టవలసిన భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని శాఖల సహకారంతో చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.