అంగన్వాడి టీచర్ల ముందస్తు అరెస్ట్

అంగన్వాడి టీచర్ల ముందస్తు అరెస్ట్

జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లను సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా వారిని ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.