బాత్రూం నిర్మించాలని గొడవ.. భర్త ఆత్మహత్య

బాత్రూం నిర్మించాలని గొడవ.. భర్త ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఎదురుపాడులో బాత్రూం సమస్య ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివశంకర్, అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. అయితే శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా  బాత్రూం నిర్మించాలని కోరింది. దీంతో ఈ విషయంపై దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.