రాజధాని ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

రాజధాని ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

KRNL: కోడుమూరు మండలంలోని జీవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఇవాళ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా MEO రామచంద్రుడు అమరావతి రాజధాని ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుందని తెలిపారు. రాజధాని అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు పెరగడం, మౌలిక వసతులు మెరుగుపడతాయన్నారు.