బొర్రాగుహలకు ఒక్కరోజు ఆదాయం ఏంటంటే..?
ASR: అనంతగిరి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలను శనివారం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు. ఉదయం నుంచే గుహలకు పర్యాటకుల రద్దీ కనిపించింది. సాయంత్రం వరకు సుమారు 3,500 మంది పర్యాటకులు బొర్రాగుహలను వీక్షించినట్లు అధికారులు తెలిపారు. పర్యాటకుల సందర్శనతో గుహలకు రూ. 3.20 లక్షల ఆదాయం సమకూరినట్లు యూనిట్ మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు.