గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
SRCL: రాచర్ల గొల్లపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రాజ్ మొహమ్మద్ (60)ను వడ్డెర కాలనీ వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మృతుడు రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి పడ్డాడు.