'సింగరేణి సంస్థ క్రీడలను ప్రోత్సహిస్తుంది'
PDPL: సింగరేణి సంస్థ క్రీడలను ప్రోత్సహిస్తుందని, గుర్తింపు కార్మిక సంఘం నేత రంగు శ్రీనివాస్ అన్నారు. సింగరేణి సంస్థ గోదావరిఖని క్రీడా మైదానంలో కార్మికుల మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. నిత్యం భూగర్భంలో పని చేసే కార్మికులు వీకెండ్ ఆట పాటలతో రిలాక్స్ కావాలన్నారు. ఈ నెల 18న ఫైనల్ మ్యాచ్ ఉంటుందన్నారు.