తొలి రోజే మానవత్వం చాటుకున్న భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్

తొలి రోజే మానవత్వం చాటుకున్న భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్

భద్రాద్రి: విధి నిర్వహణ తొలిరోజే భద్రాద్రి జిల్లా నూతన కలెక్టర్ జితేష్ వి పటేల్ మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఆదివారం బూర్గంపాడు మండలం సారపాక వద్ద ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. కాగా అటుగా వెళుతున్న జిల్లా కలెక్టర్ క్షతగాత్రులను చూసి వెంటనే కారు ఆపి తన వాహనంలోనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.