మానవత్వం చాటుకున్న ఎస్సై

మానవత్వం చాటుకున్న ఎస్సై

NLG: ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి నల్గొండ 2 టౌన్ పోలీసులు తమ ఉదారతను చాటుకున్నారు. పద్మావతి కాలనీలో మానసిక స్థితి సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న ఓ అనాథ వ్యక్తి గురించి సమాచారం అందగానే ఎస్సై సైదులు తక్షణమే స్పందించారు. పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని, బాధితుడిని చేరదీశారు. అనంతరం అమ్మానాన్న ఆశ్రమానికి తరలించి అండగా నిలిచారు.