'గోవులను చోరీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి'

NZB: నగరంలోని శివాజీనగర్, సూర్యనగర్ పద్మానగర్, సీతారాంనగర్ కాలనీల్లో గోవులను ఎత్తుకెళ్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయా కాలనీలవాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్ఆర్ చౌరస్తాపై కాలనీవాసులు, పాడి రైతులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రనగర్ వద్ద ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా.. కాలనీవాసులు గమనించి వెంబడించామన్నారు.