వరద పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే గిడ్డి

వరద పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: అయినవిల్లి మండలంలోని వరద ప్రభావిత పరిస్థితిని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. అయినవిల్లి లంకలోగల ఎదురుబిడిం కాజ్ వేలో నాటు పడవల ప్రయాణికుల భద్రతను పాటించాలన్నారు. వరద విషయంపై శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అవసరమైన బోట్లను, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచినట్లు మత్స్య శాఖ అధికారి బి. హేమానంద్ కుమార్ తెలిపారు.