అనాథ వృద్ధునికి అంత్యక్రియలు
విశాఖ మహారాణిపేటలో గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం లభ్యమైంది. హెడ్ కానిస్టేబుల్ పి.వి. రాజు మృతదేహాన్ని కింగ్ జార్జ్ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం ‘అవర్ హ్యాండ్స్’ సంస్థ ఆధ్వర్యంలో దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 33వ వార్డ్ వైసీపీ నాయకుడు బొడ్డేటి ప్రసాద్ ఆర్థిక సహాయం అందించారు.