వేదింపులు తాళలేక వివాహిత సూసైడ్

వేదింపులు తాళలేక వివాహిత సూసైడ్

SRCL: అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్ చేసుకుంది. ఇల్లంతకుంట(M) పెద్దలింగాపూర్‌కు చెందిన సుష్మతో దుబ్బాక (M) తిమ్మాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌తో 12ఏళ్ల క్రితం పెళ్లైంది. కొంతకాలంగా భర్త, అత్త, మామల వేధింపులపై సుష్మ తరచూ తల్లిదండ్రుల వద్ద వాపోయేది. ఈ క్రమంలో ఆమె శనివారం ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో భర్త, అత్త, మామపై పోలీసులు కేసు నమోదు చేశారు.