పాకిస్తాన్‌తో క్రికెట్ వద్దే వద్దు: గౌతం గంభీర్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ICC ఈవెంట్లు, ఆసియా కప్‌లో కూడా క్రికెట్ ఆడొద్దని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. 'నన్నడిగితే వద్దనే చెప్తా. భారత్‌పై ఉగ్రదాడులు ఆగే వరకు భారత్-పాక్ మధ్య సంబంధాలు ఉండొద్దు. ఏదేమైనా మేం ఆడాలా? వద్దా? అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. భారత జవాన్లు, ప్రజల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదు’ అని స్పష్టం చేశాడు.