నోబెల్ గ్రహీత నర్గెస్ అరెస్ట్
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గెస్ మొహమ్మదిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మానవ హక్కుల న్యాయవాది స్మారక చిహ్నం వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత స్వచ్ఛంద సంస్థ తెలిపింది. అయితే ఆమె అరెస్ట్ గురించి ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మహిళా మానవ హక్కుల గురించి నర్గెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు.