గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రొటోకాల్ వివాదం
AP: విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణి రాక సందర్భంగా మాజీ క్రికెటర్ MSK ప్రసాద్‌ను ఎయిర్‌పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మాజీ చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఏసీఏలోని పలువురిపై బీసీసీఐకి MSK ప్రసాద్ ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.