బత్తాయి తోటను పరిశీలించిన ఉద్యాన శాఖ అధికారి
ప్రకాశం: అర్ధవీడు మండలం మాగుటూరులోని బత్తాయి తోటలను ఉద్యానశాఖ అధికారి శ్వేత మంగళవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలు సాగులో ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నట్లయితే వేసవిలో కూడా మోటర్ల ద్వారా తోటకు నీళ్లు అందించవచ్చని చెప్పారు. అనంతరం చిన్న కంభంలో పసుపు పంట పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.