VIDEO: సబ్ కలెక్టర్‌కు వైసీపీ నేతల వినతి

ELR: రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ నూజివీడులోని YSRCP నేతలు రైతు పోరు బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో YSRCP నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏలూరు సబ్ కలెక్టర్ వినూత్నకు వినతి పత్రం అందజేశారు.