VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

అన్నమయ్య: గాలివీడు మండలంలో గురువారం తెలవారిజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నులివీడు నుండి గాలివీడు వైపు వస్తున్న టెంపో వాహనం, ప్యారంపల్లి సమీపంలో ముందుగా వెళ్తున్న స్కూటర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి, టెంపో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహూటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.