కదిరిలో యానిమేటర్లకు 5G ఫోన్లు పంపిణీ
SS: కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామ సంఘం సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్లను బుధవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో మహిళా సాధికారతను ప్రోత్సహించడం, పరిపాలనలో డిజిటల్ సాంకేతికతను భాగం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, యానిమేటర్లు పాల్గొన్నారు.