'నేడు మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం'
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ ప్రత్యేక బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య హాజరవుతారన్నారు. ఈ ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి అందరూ రావాలన్నారు.