'కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు పెంచాలి'

NGKL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచాలని వెల్దండ మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు బెక్కరి సురేష్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు పింఛన్లను పెంచలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వృద్ధులకు, వికలాంగులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు.