జస్టిస్ గోపాల్ రెడ్డి పదవీకాలం పొడిగింపు

జస్టిస్ గోపాల్ రెడ్డి పదవీకాలం పొడిగింపు

TG: తెలంగాణ అడ్మిషన్స్‌, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఏ.గోపాల్‌రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగేలా నిబంధనలకు సడలింపు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జస్టిస్‌ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో టీఏఎఫ్‌ఆర్‌సీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో ప్రకటించింది.