VIDEO: కొత్తపేటలో అంబరాన్నంటిన నవమి వేడుకలు

VIDEO: కొత్తపేటలో అంబరాన్నంటిన నవమి వేడుకలు

కోనసీమ: శ్రీరామచంద్రుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడ్డాయి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, వాడవాడలా రామనామ స్మరణతో మారుమోగింది. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.