ఆలయంలో విగ్రహం మాయం.. కేసు నమోదు
NGKL: బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లో నల్లరాతి గణనాథుని విగ్రహం మాయమైంది. గౌరీ ఈశ్వర ఆలయంలో ఉన్న విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి వాహనంలో తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఆలయ అర్చకుడు మట్టం శరత్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాసుకు వినతి పత్రం అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.