పొలం వద్ద రైతు ఆత్మహత్య
KMR: భిక్కనూరులోని కంచర్లలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల నర్సయ్య అనే వ్యక్తి తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భిక్కనూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది