VIDEO: 'ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్నాయి'
MDK: ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్నాయని ఇవాళ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 95 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, 67 రైస్ మిల్లులకు ధాన్యం తరలించినట్లు పేర్కొన్నారు. మరో 20 రైస్ మిల్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.