ఇరు వర్గాలపై బైండవర్ కేసులు..

ఇరు వర్గాలపై బైండవర్ కేసులు..

E.G: గోకవరంలో తరచూ గొడవలు జరుగుతున్న కారణంగా రెండు వర్గాలపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. కంబాల శ్రీనివాసరావు వర్గానికి, బీజేపీ మండల అధ్యక్షుడు ఇనకోటి బాపన్న దొర వర్గానికి మధ్య నెలకొన్న గొడవల దృష్ట్యా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.