టీడీపీ ఎమ్మెల్యేపై కలెక్టర్‌కు ఫిర్యాదు

టీడీపీ ఎమ్మెల్యేపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ATP: దేవరకొండ 185 సర్వే నంబరులో 292 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తూ ఎమ్మెల్యే సురేంద్ర బాబు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా గ్రీవెన్స్‌లో గ్రామస్థులతో కలిసి కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా మైనింగ్ ఆపలేదని కలెక్టర్‌కు వివరించారు.