VIDEO: అసహనం వ్యక్తం చేసిన మున్సిపల్ కమిషనర్
ATP: రాయదుర్గం పట్టణంలో రోడ్లపై ఆవులు, గాడిదలు సంచారంపై మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పశువుల యజమానులకు వారం రోజులు టైం ఇస్తున్నట్లు తెలిపారు. మరోమారు రోడ్లలో కనిపిస్తే మున్సిపల్ యాక్ట్ ద్వారా వాటిని స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలించడం జరుగుతుందని పశువుల యజమానులను హెచ్చరించారు.